News November 30, 2024
క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?
క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.
Similar News
News November 30, 2024
ప్రజలకు షాక్.. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ERC ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. యూనిట్‌కు 92 పైసల చొప్పున రేపటి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలంది. రూ.9,412 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ రూ.1,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది.
News November 30, 2024
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన కార్యక్రమాలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై BJP ‘6 అబద్ధాలు 66 మోసాలు’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. నేటి నుంచి DEC 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్లను ప్రదర్శించనుంది. రేపు జిల్లా స్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. DEC 2, 3న బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు నిర్వహించనుంది.
News November 30, 2024
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి
TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.