News November 30, 2024
క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?

క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.
Similar News
News February 17, 2026
23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.
News February 17, 2026
సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్ (కోల్‌కతాలో)తో తలపడనుంది.
News February 17, 2026
పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.


