News November 30, 2024

నేడు పింఛన్ల పంపిణీ

image

AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.

Similar News

News November 30, 2024

బంగ్లా హిందువులు సేఫ్ అంటూ అక్కడి మీడియా ఫేక్ సర్వే

image

బంగ్లాదేశ్‌లో దేవాలయాలు, హిందువులపై దాడులు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ చర్చను తప్పుదారి పట్టించేందుకు అక్కడి మీడియా ప్రయత్నిస్తోంది. యూనస్ ప్రభుత్వంలో మైనార్టీలు సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారంటూ ఓ సర్వేను విడుదల చేశాయి. అయితే 1,000 మందిని సర్వే చేయగా అందులో 92.7 శాతం ముస్లింలే ఉండటం గమనార్హం. హిందువుల రక్షణ గురించి ముస్లింల అభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 30, 2024

బోనస్‌ ఇస్తే రైతుబంధు రాదా? ప్రభుత్వం ఏమందంటే!

image

TG: క్వింటా సన్నరకం వరికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతుభరోసాను తొలగిస్తారని చాలా మంది భావిస్తున్నారు. దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంక్రాంతికి ఎకరాకు రూ.7వేల చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ప్రకటించారు. బోనస్ కొనసాగిస్తూనే రైతుభరోసా కూడా ఇస్తామన్నారు. నేటి రైతు సదస్సులో సీఎం రేవంత్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

News November 30, 2024

ఇండియాలోనూ ఆ చట్టం తీసుకురావాలి: VSR

image

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించడాన్ని భారతీయులు స్వాగతిస్తున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘నిపుణులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సలహా తీసుకుని ఇండియాలోనూ ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలి. దీనివల్ల పిల్లల సమయం వృథా కాదు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కూడా వారిని కాపాడవచ్చు’ అని ట్వీట్ చేశారు.