News November 30, 2024

నేడు పింఛన్ల పంపిణీ

image

AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.

Similar News

News December 5, 2024

జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు

image

AP: జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. రెసిడెంట్ స్పెషలిస్టులకు ₹70వేల నుంచి ₹80,500, రెసిడెంట్ డెంటిస్ట్‌లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు ₹85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.

News December 5, 2024

దేవేంద్రుడి పట్టాభిషేకం నేడే

image

మహారాష్ట్ర CMగా దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ సా.5.30 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన CMగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఫడణవీస్‌తో పాటు Dy.CMగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. అయితే డిప్యూటీ పోస్ట్ తీసుకోవడానికి ఏక్‌నాథ్ శిండే వెనుకాడుతున్నారు. ఆయన ప్రమాణం చేస్తారా? లేదా? అనేది సాయంత్రం తేలనుంది.

News December 5, 2024

రైల్వే ప్రయాణికులకు తీపి వార్త

image

ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.