News November 30, 2024

సబ్బుల ధరలు పెంపు

image

HUL, విప్రో లాంటి FMCG కంపెనీలు సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను పెంచాయి. ముడి సరుకైన పామ్ ఆయిల్ ధరలు 35-40 శాతం పెరగడంతో సబ్బుల రేట్లను 7-8% పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు టీ, స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరిగాయి. ఇటీవల కాఫీ, టీ పౌడర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.

Similar News

News January 10, 2026

స్లీపర్‌ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

image

దేశంలో స్లీపర్‌ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్‌ బస్సులను ఆటోమొబైల్‌ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News January 10, 2026

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు. * 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్ * 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు * 1974: బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ జననం (ఫొటోలో)

News January 10, 2026

1275KGల చికెన్‌తో ‘బర్డ్ స్ట్రైక్స్’కు చెక్

image

రిపబ్లిక్ డే పరేడ్‌లో IAF విన్యాసాలకు పక్షులు అడ్డురాకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బర్డ్ స్ట్రైక్స్ ప్రమాదాల నివారణకు 1275KGల బోన్‌లెస్ చికెన్‌ను ఉపయోగించనుంది. గద్దలు, ఇతర పక్షులు ఎక్కువగా తిరిగే రెడ్ ఫోర్ట్, జామా మసీద్, మండీ హౌస్, ఢిల్లీ గేట్ సహా పలు ప్రదేశాల్లో ఈనెల 15-26 వరకు 2రోజులకు ఒకసారి తక్కువ ఎత్తు నుంచి మాంసాన్ని కిందికి వదులుతారు. దీంతో అవి తక్కువ ఎత్తులోనే తిరుగుతాయి.