News November 30, 2024
సబ్బుల ధరలు పెంపు
HUL, విప్రో లాంటి FMCG కంపెనీలు సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను పెంచాయి. ముడి సరుకైన పామ్ ఆయిల్ ధరలు 35-40 శాతం పెరగడంతో సబ్బుల రేట్లను 7-8% పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు టీ, స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరిగాయి. ఇటీవల కాఫీ, టీ పౌడర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.
Similar News
News December 11, 2024
2034లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఎక్కడంటే?
ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
News December 11, 2024
BREAKING: మంచు విష్ణుకు వార్నింగ్!
TG: సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై ఆయన ఆరా తీశారు. జల్‌పల్లి నివాసం నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణును సీపీ ఆదేశించారు. ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 11, 2024
చైనాలో విజయ్ మూవీకి భారీ కలెక్షన్లు
విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహారాజ’ చైనా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.