News November 30, 2024

GOOD NEWS.. వేలి ముద్ర పడకపోయినా పెన్షన్

image

TG: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారింది. మెషీన్లు వేలి ముద్రను గుర్తించకపోతే పింఛను లేనట్టే. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. మంచానికి పరిమితమై ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు, వేలి ముద్ర పడని వారికి పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రను నమోదు చేసి, పింఛన్ డబ్బులు అందజేయాలని ఆదేశించింది.

Similar News

News July 6, 2025

ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

News July 6, 2025

విజయానికి 5 వికెట్లు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.