News November 30, 2024

GOOD NEWS.. వేలి ముద్ర పడకపోయినా పెన్షన్

image

TG: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారింది. మెషీన్లు వేలి ముద్రను గుర్తించకపోతే పింఛను లేనట్టే. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. మంచానికి పరిమితమై ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు, వేలి ముద్ర పడని వారికి పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రను నమోదు చేసి, పింఛన్ డబ్బులు అందజేయాలని ఆదేశించింది.

Similar News

News January 25, 2026

చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.

News January 25, 2026

భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

image

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.

News January 25, 2026

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

image

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్‌ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్‌ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్‌ హెయిర్‌ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్‌/ క్యాప్‌ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.