News November 30, 2024
నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్

AP: నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Similar News
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News July 9, 2025
నిమిషకు మరణశిక్ష.. తప్పెవరిది?

యెమెన్‌లో <<17008510>>నిమిష <<>>మరణశిక్ష ఎదుర్కోబోతుండటం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ లాక్కుని వేధిస్తున్నాడని మెహదీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని అతడికి ఆమె మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేసిందని, వదిలేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల తప్పు కూడా ఉందంటున్నారు. PM మోదీ జోక్యం చేసుకుని విడిపించాలని కోరుతున్నారు.