News November 30, 2024

నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్

image

AP: నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Similar News

News February 9, 2026

4/800 మార్కులు.. అయినా..

image

NEET-PG <<18852584>>కటాఫ్‌<<>>ను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన వారికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. రోహ్‌తక్‌లోని ఓ కాలేజీలో ఆర్థోపెడిక్స్ సీటు 800కిగానూ 4 మార్కులకు, ఢిల్లీలోని టాప్ కాలేజీలో గైనకాలజీ సీటు 44mrksకు దక్కడం గమనార్హం. ఇంత తక్కువ మెరిట్ ఉన్నా సీట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

News February 9, 2026

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సభ్యులు నిరసన చేపట్టడంతో స్పీకర్ సభను మ.12 గంటలకు వాయిదా వేశారు.

News February 9, 2026

హైకోర్టులో అంబటి లంచ్ మోషన్ పిటిషన్

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. కాగా గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన సందర్భంగా రాంబాబు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనను గుంటూరు తరలించారు.