News November 30, 2024
డిగ్రీనే కదా ఎంజాయ్ చేస్తామంటే మీకే నష్టం!

UGC ఆమోదించిన ఫ్లెక్సిబుల్ డ్యురేషన్ డిగ్రీ గైడ్‌లైన్స్ ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు తేవొచ్చు. మూడేళ్ల డిగ్రీని ఆర్నెల్లు ముందుగానే పూర్తిచేస్తే విద్యార్థుల మధ్య పోటీ పెరుగుతుంది. మెల్లగా చదువుతాం, బ్యాక్‌లాగులు రాస్తామంటే కష్టమే. విద్య, ఉపాధి అవకాశాలు వేగంగా డిగ్రీ పూర్తిచేసినవాళ్లకే ఎక్కువగా ఉంటాయి. టైమ్ కావాలనుకొనే వాళ్లు, స్కిల్స్ నేర్చుకొనేవాళ్లు డిగ్రీ వ్యవధిని ఆర్నెల్లు పెంచుకోవచ్చు.
Similar News
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.
News March 21, 2026
8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

ఢిల్లీ నుంచి వాంకోవర్(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్‌కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.


