News November 30, 2024

డిగ్రీనే కదా ఎంజాయ్ చేస్తామంటే మీకే నష్టం!

image

UGC ఆమోదించిన ఫ్లెక్సిబుల్ డ్యురేషన్ డిగ్రీ గైడ్‌లైన్స్‌ ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు తేవొచ్చు. మూడేళ్ల డిగ్రీని ఆర్నెల్లు ముందుగానే పూర్తిచేస్తే విద్యార్థుల మధ్య పోటీ పెరుగుతుంది. మెల్లగా చదువుతాం, బ్యాక్‌లాగులు రాస్తామంటే కష్టమే. విద్య, ఉపాధి అవకాశాలు వేగంగా డిగ్రీ పూర్తిచేసినవాళ్లకే ఎక్కువగా ఉంటాయి. టైమ్ కావాలనుకొనే వాళ్లు, స్కిల్స్ నేర్చుకొనేవాళ్లు డిగ్రీ వ్యవధిని ఆర్నెల్లు పెంచుకోవచ్చు.

Similar News

News January 21, 2026

భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

image

TG: వనపర్తికి చెందిన ఆంజనేయులు, సరస్వతి (34) HYD బోరబండలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమై గొడవలు జరిగేవి. అటు ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నా’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.

News January 21, 2026

‘మీ ఫోన్ కూడా ట్యాప్’?.. ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హరీశ్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘2018 ఎన్నికల తర్వాత మీ ఫోన్, మీ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హరీశ్ షాక్‌కు గురై ‘ఇది మీరు సృష్టించారా?’ అని అడిగారని, పోలీసులు ట్యాప్ అయిన తేదీలు చెబుతూ ఆధారాలు చూపించారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News January 21, 2026

WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్‌గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.