News November 30, 2024

పాకిస్థాన్ చేతిలో భారత్ U19 జట్టు ఓటమి

image

U19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. 282 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత జట్టు 47.1 ఓవర్లలో 237 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్(159) సెంచరీతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్(67) ఫర్వాలేదనిపించినా మిగిలిన వారంతా విఫలమయ్యారు.

Similar News

News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(1/2)

image

1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టుకట్టారు. లిబరలైజేషన్(వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ(ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు.

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(2/2)

image

1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. రూపాయి విలువను తగ్గించి విదేశీ మార్కెట్లో IND ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంటగ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. IMF సాయం పొందటం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి-దిగుమతి నిబంధనలను సరళీకరించారు. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.