News November 30, 2024
పాకిస్థాన్ చేతిలో భారత్ U19 జట్టు ఓటమి

U19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. 282 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత జట్టు 47.1 ఓవర్లలో 237 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్(159) సెంచరీతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్(67) ఫర్వాలేదనిపించినా మిగిలిన వారంతా విఫలమయ్యారు.
Similar News
News July 11, 2025
భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News July 11, 2025
ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.
News July 11, 2025
మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.