News November 30, 2024

రైతుల కళ్లలో ఆనందం చూసేవరకు విశ్రమించం: తుమ్మల

image

TG: రైతుల కళ్లలో ఆనందం చూసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌‌లో నిర్వహించిన ‘రైతు పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుబంధును తాము విడుదల చేశామన్నారు. ఇప్పటికే రూ.7,625 కోట్లు విడుదల చేశామని తెలిపారు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ రాహుల్ గాంధీ వాగ్దానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 22, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News March 22, 2026

చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

image

దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యధిక రోజులు(8,931) ప్రభుత్వాధినేతగా(గుజరాత్ CM+ దేశ PM) పని చేసిన వ్యక్తిగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ CM పవన్ చామ్లింగ్(8,930) రికార్డును బ్రేక్ చేశారన్నారు. మోదీ గుజరాత్ CMగా 12 ఏళ్ల 227 రోజులు పనిచేశారు. PMగా నేటితో 11 ఏళ్ల 299 రోజులు పూర్తి చేసుకున్నారు.

News March 22, 2026

ఆ 2 గంటలు చాలా ముఖ్యం!

image

<<19446288>>సైబర్<<>> మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే <>CyberCrime.gov.in<<>> పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డులను వెంటనే బ్లాక్ చేయించి, మోసపూరిత లావాదేవీ గురించి బ్యాంకుకు సమాచారం అందించాలి. మోసం జరిగిన మొదటి 1-2 గంటల్లో కంప్లైంట్ ఇవ్వగలిగితే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.