News November 30, 2024
రైతుల కళ్లలో ఆనందం చూసేవరకు విశ్రమించం: తుమ్మల

TG: రైతుల కళ్లలో ఆనందం చూసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘రైతు పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుబంధును తాము విడుదల చేశామన్నారు. ఇప్పటికే రూ.7,625 కోట్లు విడుదల చేశామని తెలిపారు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ రాహుల్ గాంధీ వాగ్దానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.


