News November 30, 2024
ఏ నిర్ణయమైనా ఓకే కానీ గౌరవం కావాలి: పీసీబీ

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం విషయంలో తాము ఏ నిర్ణయానికైనా సుముఖంగానే ఉన్నామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ తెలిపారు. ‘సమస్యను పరిష్కరించాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే ఐసీసీ తీసుకునే నిర్ణయాలు మమ్మల్ని గౌరవించేలా ఉండాలి. సమానత్వం పాటించాలి. మా ప్రతిష్ఠకు భంగం వాటిల్లకూడదు’ అని పేర్కొన్నారు. టోర్నీని హైబ్రీడ్ విధానంలో నిర్వహించేందుకు పాక్ అంగీకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 20, 2026
విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.
News March 20, 2026
CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.
News March 20, 2026
మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.


