News November 30, 2024

ఏ నిర్ణయమైనా ఓకే కానీ గౌరవం కావాలి: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం విషయంలో తాము ఏ నిర్ణయానికైనా సుముఖంగానే ఉన్నామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ తెలిపారు. ‘సమస్యను పరిష్కరించాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే ఐసీసీ తీసుకునే నిర్ణయాలు మమ్మల్ని గౌరవించేలా ఉండాలి. సమానత్వం పాటించాలి. మా ప్రతిష్ఠకు భంగం వాటిల్లకూడదు’ అని పేర్కొన్నారు. టోర్నీని హైబ్రీడ్ విధానంలో నిర్వహించేందుకు పాక్ అంగీకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2024

రేపే పుష్ప-2 రిలీజ్.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

రేపు పుష్ప-2 రిలీజ్ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించే సినిమా విజయం కావాలని కోరుకుందామన్నారు. ‘అందరినీ అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. కాగా, అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ఫైట్ జరుగుతోన్న వేళ ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

News December 4, 2024

రేపు ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

AP: రేపు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News December 4, 2024

ఇక్కడ అబ్బాయిలు గిన్నెలు తోమి, వంటలు చేయాలి

image

అమ్మాయిలు ఇంటి పని చేయాలని, అబ్బాయిలు బయట ఆడుకోవచ్చనే కోణాన్ని పిల్లల నుంచి తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వారికి లింగ సమానత్వాన్ని నేర్పించేందుకు జెండర్ ఈక్వాలిటీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో పనులు, గిన్నెలు తోమడం, వంట చేయడం వంటివి నేర్పుతారు. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. చిన్నప్పుడే పిల్లల ఆలోచనా విధానం మార్చితే మార్పులొస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.