News December 1, 2024
అశ్విన్, జడేజాకు ప్రత్యామ్నాయం లేదు: పుజారా

భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయ బౌలర్లు భారత్‌లో ఇంకా రాలేదని ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘నేను మన దేశవాళీ టోర్నీలో ఎంతోమంది స్పిన్నర్లను చూశాను. కానీ అశ్విన్, జడ్డూని రీప్లేస్ చేయగల స్థాయి ఎవరికీ లేదు. అలాంటి ఆటగాళ్లు మళ్లీ రావాలంటే చాలాకాలం పడుతుంది. నైపుణ్యం కలిగిన యువ బౌలర్లు కొంతమంది ఉన్నారు కానీ వారికింకా చాలా అనుభవం రావాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 25, 2026
పవన్ సినిమాల్లో నటించొద్దని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

AP: సినిమాల్లో నటించకుండా Dy.CM పవన్ కళ్యాణ్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ‘హరిహరవీరమల్లు’ టికెట్ ధరల పెంపు విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. నిర్మాత అభ్యర్థన మేరకే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని పవన్ తరఫు లాయర్లు వాదించారు.
News March 25, 2026
సమ్మర్ షాక్.. పెరగనున్న ACల ధరలు

ఈ వేసవిలో ACల ధరలు 8% నుంచి 12% వరకు పెరగనున్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త BEE (Bureau of Energy Efficiency) ఎనర్జీ రేటింగ్ నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో కాపర్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కంపెనీలపై భారాన్ని పెంచాయి. ఈ అదనపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు ధరలను పెంచుతున్నాయి.
News March 25, 2026
ఇందిరమ్మ ఇండ్లు.. లక్ష దాటిన శ్లాబులు

TG: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,13,365 ఇళ్ల శ్లాబులు పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు ₹5,376.22 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 2.65 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వర్క్ ప్రోగ్రెస్‌ను బట్టి ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొంది.


