News December 1, 2024
అశ్విన్, జడేజాకు ప్రత్యామ్నాయం లేదు: పుజారా

భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయ బౌలర్లు భారత్‌లో ఇంకా రాలేదని ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘నేను మన దేశవాళీ టోర్నీలో ఎంతోమంది స్పిన్నర్లను చూశాను. కానీ అశ్విన్, జడ్డూని రీప్లేస్ చేయగల స్థాయి ఎవరికీ లేదు. అలాంటి ఆటగాళ్లు మళ్లీ రావాలంటే చాలాకాలం పడుతుంది. నైపుణ్యం కలిగిన యువ బౌలర్లు కొంతమంది ఉన్నారు కానీ వారికింకా చాలా అనుభవం రావాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 16, 2026
పట్టుచీర కట్టిన తర్వాత..

* చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేస్తే సరిపోతుంది. * చీరలను కట్టిన వెంటనే కాకుండా నాలుగైదు సార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇస్తే సరిపోతుంది. * కొత్త చీరలను డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో వాష్ చేస్తారు. అలాంటప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని ఎంచుకోవాలి. * ఎంబ్రాయిడరీ, ఇతర వర్కులు ఉన్న హెవీ చీరలను చేత్తోనే ఉతకడం మంచిది. * రెండు, మూడు చీరలు ఉతకాల్సి వచ్చినపుడు వేటికవే విడిగా ఉతకాలి.
News January 16, 2026
కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News January 16, 2026
మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.


