News December 1, 2024
ఈనెల 6న బీజేపీ బహిరంగ సభ
TG: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఈనెల 6న బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్‌గా నిర్వహించనున్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది.
Similar News
News December 1, 2024
ఈ పాట చాలా కాలం మోగుతూనే ఉంటుంది: రామ జోగయ్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘నానా హైరానా’ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటపై లిరిసిస్ట్ రామ జోగయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆమ్మో.. ఈ పాట ఇప్పట్లో ఆగదు. చాలా దూరం వెళ్తుంది. చాలా కాలం మోగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటూ తనను అభినందించిన డైరెక్టర్లు మెహర్ రమేశ్, మహేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 1, 2024
నెట్టింట విమర్శలు.. ట్విటర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన విఘ్నేశ్
తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ట్విటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వేధింపులు పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హీరో ధనుష్, నయనతారల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్త విఘ్నేశ్ విమర్శలకు కేంద్రంగా నిలిచారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నెట్టింట చర్చ జరుగుతోంది.
News December 1, 2024
రూట్ ప్రపంచ రికార్డు
ENG క్రికెటర్ రూట్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టు 4th ఇన్నింగ్సుల్లో అత్యధిక రన్స్(1,630) చేసిన ఆటగాడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో సచిన్(1,625), కుక్(1,611), గ్రేమ్ స్మిత్(1,611), చందర్‌పాల్(1,580) ఉన్నారు. అలాగే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక స్ట్రైక్ రేటు(88.08)తో వెయ్యికి పైగా రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా డకెట్(ENG) ఘనత సాధించారు. 2010లో సెహ్వాగ్ 90.80 స్ట్రైక్ రేటుతో 1,422 రన్స్ చేశారు.