News December 1, 2024
ఈనెల 6న బీజేపీ బహిరంగ సభ

TG: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఈనెల 6న బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్‌గా నిర్వహించనున్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది.
Similar News
News February 8, 2025
9 గంటల విచారణలో ఆర్జీవీకి 41 ప్రశ్నలు

AP: ఒంగోలు రూరల్ PSలో డైరెక్టర్ RGVని నిన్న 9 గంటల పాటు 41 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటిలో 90% ఆయన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. అలాగే, మరో కేసులో ఆయనకు గుంటూరు CID నోటీసులిచ్చి ఈ నెల 10న విచారణకు రావాలంది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బి.వంశీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.
News February 8, 2025
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.
News February 8, 2025
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.