News December 1, 2024

FBI డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్

image

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు.

Similar News

News December 1, 2024

రోహిత్ శర్మ కొడుకు పేరు ఇదే

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ తనయుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని రితిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్‌మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ బొమ్మ ఫొటోను ఆమె షేర్ చేశారు. అందులోని బొమ్మలకు రోహిత్, రితిక, సమ్మీ, అహాన్ అని పేర్లు పెట్టారు. నవంబర్ 15న రోహిత్-రితిక దంపతులు తమ కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

News December 1, 2024

ఈ పాట చాలా కాలం మోగుతూనే ఉంటుంది: రామ జోగయ్య

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘నానా హైరానా’ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటపై లిరిసిస్ట్ రామ జోగయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆమ్మో.. ఈ పాట ఇప్పట్లో ఆగదు. చాలా దూరం వెళ్తుంది. చాలా కాలం మోగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటూ తనను అభినందించిన డైరెక్టర్లు మెహర్ రమేశ్, మహేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 1, 2024

నెట్టింట విమర్శలు.. ట్విటర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన విఘ్నేశ్

image

తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ట్విటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వేధింపులు పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హీరో ధనుష్, నయనతారల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్త విఘ్నేశ్‌ విమర్శలకు కేంద్రంగా నిలిచారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నెట్టింట చర్చ జరుగుతోంది.