News December 1, 2024

FBI డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్

image

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు.

Similar News

News February 19, 2025

ఉద్యోగం వదిలేసి వ్యాపారం.. CM చంద్రబాబు ప్రశంసలు

image

ఇంజినీర్ ఉద్యోగం వదిలి మిల్లెట్ వ్యాపారం చేస్తున్న బొర్రా శ్రీనివాస రావును CM చంద్రబాబు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిస్తున్న ఆయన్ను త్వరలో కలుస్తానన్నారు. ‘మన్యం గ్రెయిన్స్’ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించి 400-500 మంది రైతులకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. వారి ఆదాయం 20-30% పెరిగేలా చేశారని తెలిపారు. 2018లో అనకాపల్లిలో నెలకొల్పిన ఈ సంస్థ ఆదాయం 2023-24లో ₹1cr+కి చేరింది.

News February 19, 2025

ఆన్‌లైన్ డేటింగ్.. రూ.4.3 కోట్లు మోసపోయిన మహిళ

image

ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన అన్నెట్ ఫోర్డ్ (57) అనే మహిళ ఆన్‌లైన్ డేటింగ్‌లో రూ.4.3 కోట్లు మోసపోయారు. భర్తకు దూరమైన అన్నెట్ నిజమైన ప్రేమ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ‘ప్లెంటీ ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్ సైట్‌లో విలియం అనే వ్యక్తితో పరిచయమై రూ.1.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత FBలో పరిచయమైన నెల్సన్ అనే వ్యక్తి మరో రూ.కోటిన్నర తీసుకున్నాడు. మరో మహిళకు రూ.98.5 లక్షలు ఇచ్చి మోసపోయారు.

News February 19, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

image

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

error: Content is protected !!