News December 1, 2024

రైతులే కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యం: రేవంత్

image

TG: నెహ్రూ నుంచి నేటివరకు రైతులే కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యమని CM రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉందని, రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్నారు. ‘KCR బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధును మేం చెల్లించాం. ఆగస్టు 15 నాటికి 22.22 లక్షల మందికి రుణమాఫీ చేశాం. నిన్న కూడా 3.14 లక్షల మంది రైతులకు రూ.2747కోట్ల రుణమాఫీ చేశాం. BRS రుణమాఫీ విషయంలో పదేళ్ల పాటు మోసగించింది’ అని ఆరోపించారు.

Similar News

News April 18, 2026

మహిళలకు విపక్షాల ద్రోహం: CM

image

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.

News April 18, 2026

ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

image

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.

News April 18, 2026

‘వారణాసి’పై ఎండల ఎఫెక్ట్!

image

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘వారణాసి’ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేశ్‌పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహేశ్, జక్కన్న తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారట. ఆ తర్వాత జూన్ నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.