News December 1, 2024

ముఖంపై దుప్పటి కప్పుకుంటున్నారా..?

image

చాలామంది దుప్పటిని ముఖంపైవరకూ కప్పుకుని నిద్రపోతుంటారు. ఇది మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘దుప్పటి కప్పేయడం వల్ల మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌నే మళ్లీ పీలుస్తుంటాం. ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. తలనొప్పి, వికారం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మెదడు, రక్తనాళాల పనితీరు మందగిస్తుంది. దుప్పటిని తల మీదికి కప్పుకోకపోవడమే శ్రేయస్కరం’ అని పేర్కొంటున్నారు.

Similar News

News March 7, 2026

వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

image

ఎండ వేడిమికి మూగజీవాలు చల్లదనం కోసం ఆగి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటుంటాయి. వాహనదారులు గమనించకుండా బండిని స్టార్ట్ చేసి ముందుకు తీయడం వల్ల ఇవి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కూడా కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి వాహనం తీసే ముందు ఒక్కసారి కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే మిద్దెపై, ఆరుబయట పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 7, 2026

సిలిండర్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే ఫైర్

image

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. డొమెస్టిక్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచడం సామాన్యులకు భారమేనని మండిపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోదీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని X వేదికగా ఎద్దేవా చేశారు.

News March 7, 2026

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

image

ఇరాన్-US యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం లీటర్‌పై ఏకంగా 55 PKR(17 శాతం) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 266.17 PKR నుంచి 321.17 PKRకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర లీటర్‌కు 280.86 నుంచి 335.86కి(20%) ఎగిసింది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని పాక్ పెట్రోలియం మంత్రి మాలిక్ అన్నారు. ఇండియాలోనూ <<19316911>>గ్యాస్ ధరలు<<>> పెరిగిన విషయం తెలిసిందే.