News December 1, 2024

ముఖంపై దుప్పటి కప్పుకుంటున్నారా..?

image

చాలామంది దుప్పటిని ముఖంపైవరకూ కప్పుకుని నిద్రపోతుంటారు. ఇది మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘దుప్పటి కప్పేయడం వల్ల మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌నే మళ్లీ పీలుస్తుంటాం. ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. తలనొప్పి, వికారం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మెదడు, రక్తనాళాల పనితీరు మందగిస్తుంది. దుప్పటిని తల మీదికి కప్పుకోకపోవడమే శ్రేయస్కరం’ అని పేర్కొంటున్నారు.

Similar News

News February 17, 2025

రూ.15 కోట్లు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కొన్నాడు!

image

ఖరీదైన కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా HK$14.2 మిలియన్లు (రూ.15.83 కోట్లు) పెట్టి అరుదైన సింగిల్-లెటర్ రిజిస్ట్రేషన్ మార్క్ ‘S’ను కొనుగోలు చేశారు. ఇది హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన వేలంలో జరిగింది. అలాగే ‘88’ అనే నంబర్ ప్లేట్‌ను HK$11 మిలియన్లకు (రూ.12 కోట్లు) మరో వ్యక్తి దక్కించుకున్నారు.

News February 17, 2025

కేజీహెచ్‌లో GBS మరణం? కొట్టిపారేసిన సూపరింటెండ్

image

AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.

News February 17, 2025

ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ: సీఎం

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.

error: Content is protected !!