News December 2, 2024

నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!

image

TG: చంచల్‌గూడ జైలు నుంచి ఓ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలతో విడుదలయ్యాడు. భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్‌(27)ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడు ఫేక్ బెయిల్ పత్రాలను జైలు అధికారులకు ఇచ్చి గత నెల 26న బయటకు వచ్చాడు. కానీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో అవి నకిలీవని గుర్తించి కంగుతిన్నారు. ఇప్పుడా ఖైదీ కోసం జైలు అధికారులు వెతికే పనిలో పడ్డారు.

Similar News

News January 1, 2026

అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

News January 1, 2026

గుండెలు పగిలే బాధ.. ఈ తల్లి శోకాన్ని తీర్చేదెవరు?

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి చనిపోయిన వారిలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.

News January 1, 2026

డెలివరీ అయ్యాక బెల్ట్ వాడుతున్నారా?

image

డెలివరీ అయ్యాక కండరాల పటుత్వం కోసం, పొట్ట పెరగకుండా ఉండేందుకు చాలా మంది మహిళలు Abdominal Belt వాడుతుంటారు. నార్మల్ డెలివరీ అయితే 1-2 రోజులకు, సిజేరియన్ అయితే డాక్టర్ సూచనతో 7-10 రోజులకు మొదలుపెట్టొచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రోజుకు 2-8 గంటలు, మూడు నెలల పాటు వాడితే సరిపోతుందంటున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బెల్ట్ వాడకూడదని చెబుతున్నారు.