News December 2, 2024

నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!

image

TG: చంచల్‌గూడ జైలు నుంచి ఓ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలతో విడుదలయ్యాడు. భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్‌(27)ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడు ఫేక్ బెయిల్ పత్రాలను జైలు అధికారులకు ఇచ్చి గత నెల 26న బయటకు వచ్చాడు. కానీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో అవి నకిలీవని గుర్తించి కంగుతిన్నారు. ఇప్పుడా ఖైదీ కోసం జైలు అధికారులు వెతికే పనిలో పడ్డారు.

Similar News

News February 7, 2025

ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.

News February 7, 2025

విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు

image

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్‌గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.

News February 7, 2025

RTC జేఏసీని చర్చలకు పిలిచిన కార్మిక శాఖ

image

TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.

error: Content is protected !!