News December 2, 2024

అయోధ్య లాంటి ఉద్యమం చేయాలి: కర్ణాటక MLA

image

కర్ణాటక బీదర్ జిల్లాలో అనుభవ మంటపం పునర్నిర్మాణానికి అయోధ్య లాంటి ఉద్యమం చేపట్టాలని విజయపుర MLA బసనగౌడ పాటిల్ పిలుపునిచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మంటపం ఉన్న స్థానంలో ముస్లిం సాధువు దర్గా పీర్ పాషా బంగ్లాను ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ఉద్యమం ప్రారంభించి, మంటపం తిరిగి అదే స్థలంలో నిర్మించే వరకు పోరాటం ఆగదన్నారు. వివిధ లింగాయత్‌ మఠాల మఠాధిపతులు పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Similar News

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 14, 2025

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

image

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.

News March 14, 2025

WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

image

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.

error: Content is protected !!