News December 2, 2024

అయోధ్య లాంటి ఉద్యమం చేయాలి: కర్ణాటక MLA

image

కర్ణాటక బీదర్ జిల్లాలో అనుభవ మంటపం పునర్నిర్మాణానికి అయోధ్య లాంటి ఉద్యమం చేపట్టాలని విజయపుర MLA బసనగౌడ పాటిల్ పిలుపునిచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మంటపం ఉన్న స్థానంలో ముస్లిం సాధువు దర్గా పీర్ పాషా బంగ్లాను ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ఉద్యమం ప్రారంభించి, మంటపం తిరిగి అదే స్థలంలో నిర్మించే వరకు పోరాటం ఆగదన్నారు. వివిధ లింగాయత్‌ మఠాల మఠాధిపతులు పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Similar News

News February 9, 2025

రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

News February 9, 2025

మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు

image

మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్‌<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News February 9, 2025

నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!