News December 2, 2024
మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్-2025

జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. మే 18న పరీక్ష జరగనుంది. పేపర్ 1 ఉ.9 గం. నుంచి మ.12 వరకు, పేపర్ 2 మ.2.30 గం. నుంచి సా.5.30 వరకు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Similar News
News April 2, 2026
పబ్లిక్ ప్లేసుల్లో పిల్లలపై కోప్పడుతున్నారా?

బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్టులు సూచిస్తున్నారు. ‘తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పబ్లిక్ ప్లేసుల్లో మర్యాదగా, గౌరవంగా మాట్లాడితే, దయతో వ్యవహరిస్తే వాళ్లూ అదే ఫాలో అవుతారు. మంచి నడవడిక, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అరవడం, తిట్టడం, చెడుగా మాట్లాడటం వారిపై ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో వాళ్లూ అలానే ప్రవర్తించవచ్చు’ అని చెబుతున్నారు.
News April 2, 2026
IIFCLలో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అప్లై చేశారా?

33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL), న్యూఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. MBA/ PGDBMలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 10.04.26 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.iifcl.in చూడండి.
News April 2, 2026
యుద్ధాలు: ఇండియా ఆయుధాలకు గిరాకీ

యుద్ధాల నేపథ్యంలో పలు దేశాలు భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆయుధ కొనుగోళ్లను పెంచుకుంటున్నాయి. ఈ తరుణంలో మన డిఫెన్స్ యంత్ర పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. 2025-26లో ₹38,424CR మేర ఇండియా డిఫెన్స్ ఎగుమతులు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇది గత ఏడాదికన్నా 62%అధికం. 2021-22లో ఈ ఎగుమతి విలువ ₹12,814 CR మాత్రమే. మొత్తం ఎగుమతుల్లో 54.84% పబ్లిక్ సెక్టార్లో, 45.16% PVT సెక్టార్లో జరిగాయి.


