News December 2, 2024

మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్-2025

image

జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. మే 18న పరీక్ష జరగనుంది. పేపర్ 1 ఉ.9 గం. నుంచి మ.12 వరకు, పేపర్ 2 మ.2.30 గం. నుంచి సా.5.30 వరకు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, NITల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Similar News

News January 20, 2025

ట్రంప్ పార్టీ: నీతా అంబానీ కాంచీపురం పట్టుచీర స్పెషాలిటీ ఇదే!

image

డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు రిసెప్షన్‌లో నీతా అంబానీ కట్టుకున్న పట్టుచీరపై నెట్టింట చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత బీ కృష్ణమూర్తి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పురాణాల్లో కాంచీపురం మందిరాల ప్రాముఖ్యాన్ని శోధించి 100+ మోటిఫ్స్‌ డిజైన్ చేశారు. విష్ణువును ప్రతిబింబించేలా 2 తలల గరుడపక్షి, అమృతత్వం, దైవత్వానికి గుర్తుగా నెమళ్లను నేయించారు. దీనికి తోడుగా 18వ శతాబ్దపు వారసత్వ నగను నీతా ధరించారు.

News January 20, 2025

నేను నేరం చేయలేదు: సంజయ్ రాయ్

image

తాను తప్పు చేయలేదని కలకత్తా హత్యాచార ఘటన దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తీర్పు ఖరారుపై కాసేపటి క్రితం సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. కాగా 2024 AUG 9న RG Kar ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైంది. ఆ మరుసటి రోజు మాజీ పోలీస్ కాంట్రాక్టు ఉద్యోగి <<15203033>>సంజయ్<<>> ఈ కేసులో అరెస్టయ్యాడు.

News January 20, 2025

‘హిండెన్‌బర్గ్’ అండర్సన్‌పై మోసం కేసు నమోదుకు ఆస్కారం!

image

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ యజమాని అండర్సన్‌పై సెక్యూరిటీ ఫ్రాడ్ కేసు నమోదవ్వొచ్చని సమాచారం. కంపెనీలే టార్గెట్‌గా రిపోర్టులు రూపొందించేందుకు హెడ్జ్‌ఫండ్ కంపెనీలతో కుమ్మక్కైనట్టు ఆంటారియో కోర్టులో దాఖలైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. షేర్ల ట్రేడింగులో పాల్గొంటున్నట్టు చెప్పకుండా బేరిష్ రిపోర్టులను రూపొందించడం US SEC ప్రకారం నేరమని ఆ నివేదిక నొక్కిచెప్పింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం తెలిసిందే.