News December 2, 2024

మావోలపై విష పదార్థాలు వాడలేదు: డీజీపీ

image

TG: ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని DGP జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

Similar News

News February 4, 2026

చెత్త ఏరుకునే వారిలో SCలే అధికం: కేంద్రం

image

సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులపై కేంద్రం చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 1.52 లక్షల మంది చెత్త ఏరుకునేవారు ఉన్నారని, వీరిలో దాదాపు 84.5% మంది SC, ST, OBC సామాజిక వర్గాలకు చెందినవారేనని తేలింది. వీరిలో SCలు 60.3%, OBCలు 13.7%, OCలు 10.7%, STలు 10.5% ఉన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సేకరించింది.

News February 4, 2026

కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

image

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.

News February 4, 2026

వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

image

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.