News December 2, 2024

మావోలపై విష పదార్థాలు వాడలేదు: డీజీపీ

image

TG: ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని DGP జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

Similar News

News February 9, 2026

లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా?

image

లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్‌ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి లిప్‌స్టిక్‌ను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కెమికల్స్, పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి. లిప్ స్టిక్ వేసుకునే ముందు బేస్ కోసం కన్సీలర్ ఉపయోగించండి. ప్రెగ్నెన్సీలో వాడకపోవడమే మంచిది.

News February 9, 2026

అంబటి రాంబాబుపై 52 కేసులు!

image

AP: వైసీపీ నేత <<19026518>>అంబటి రాంబాబు<<>>పై రాష్ట్రవ్యాప్తంగా 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 3 పీటీ వారెంట్లను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. అటు అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, 8 రోజుల్లో 36 కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపించింది. మరిన్ని పీటీ వారెంట్లు జారీ చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పాలని ప్లాన్ చేస్తోందని విమర్శించింది. CM CBNపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్టయ్యారు.

News February 9, 2026

సైలెంట్ కిల్లర్: భారత్‌లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

image

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్‌లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.