News December 2, 2024

BREAKING: పుష్ప-2పై హైకోర్టులో పిటిషన్

image

TG: పుష్ప-2 టికెట్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ.800 పెంచుకునేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. డిసెంబర్ 5-8 వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంపునకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపుపై మీ కామెంట్?

Similar News

News March 17, 2026

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

image

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్‌లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్‌ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.

News March 17, 2026

ప్లాస్టిక్ ధరల పెరుగుదల.. కీలక రంగాలకు సెగ

image

కేరళంలోని ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ముడిసరకు ధరల పెరుగుదల, మూలధన కొరతతో మూతపడుతున్నాయి. దీనివల్ల FMCG, ఫుట్‌వేర్, హెల్త్‌కేర్ సెక్టార్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 20-25% యూనిట్లు ఆపరేషన్స్ నిలిపివేసినట్లు కేరళ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫలితంగా బాటిళ్లు, సోల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలు పెరిగాయి.

News March 17, 2026

మరో కీలక ఇరాన్‌ నేత టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడి

image

యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వ్యవహారాల్లో కీలకంగా మారిన ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి చేశాయి. ఈ అటాక్‌లో లారిజనీ మరణించారా? లేదా? అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రాత్రి జరిపిన దాడుల్లో పారామిలటరీ చీఫ్ గొలమ్‌రెజానూ టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.