News December 2, 2024

BREAKING: పుష్ప-2పై హైకోర్టులో పిటిషన్

image

TG: పుష్ప-2 టికెట్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ.800 పెంచుకునేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. డిసెంబర్ 5-8 వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంపునకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపుపై మీ కామెంట్?

Similar News

News January 24, 2025

RTCలో సమ్మె సైరన్

image

TGSRTCలో సమ్మె సైరన్ మోగింది. హైర్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 27న HYDలోని బస్‌భవన్ ముందు ధర్నాకు దిగనున్నాయి. ఆ రోజే యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి. RTC <<15210949>>ప్రైవేటీకరణలో <<>>భాగంగా హైర్ పద్ధతిలో బస్సులు ప్రవేశపెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. RTC డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు.

News January 24, 2025

రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ కుటుంబాలు

image

AP: రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 2016-17లో నాబార్డ్ రూరల్ ఫైనాన్షియల్ సర్వే ప్రకారం 34 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 2021-22లో ఆ సంఖ్య 53 శాతానికి చేరింది. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో 19శాతం మేర వ్యవసాయ కుటుంబాలు పెరిగినట్లైంది. అటు దేశ సరాసరి కూడా 48% నుంచి 57%కు పెరిగింది. APతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల్లో 50శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి.

News January 24, 2025

జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేశారా?

image

జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల అడ్మిట్ కార్డులను NTA తాజాగా విడుదల చేసింది. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను గతంలోనే రిలీజ్ చేయగా, మిగతా రోజుల్లో జరిగే ఎగ్జామ్స్ కోసం తాజాగా ఆన్‌లైన్‌లో పెట్టింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.