News December 3, 2024

నటి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్

image

హైదరాబాద్ గచ్చిబౌలిలో నటి శోభిత శివన్న ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె తల్లి, అక్కాచెల్లెళ్లు నిన్న పోలీసుల విచారణలో పలు విషయాలు వివరించారు. ఆమె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలు మానేసిందని, తెలుగులో అవకాశాల కోసం HYD వచ్చిందని చెప్పారు. ఒంటరిగా ఉండటం, అవకాశాలు రాక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Similar News

News January 22, 2026

IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIFCL <<>>ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ (ఫైనాన్స్/MBA/PGDM/ఎననామిక్స్, టూరిజం మేనేజ్‌మెంట్, ESG మేనేజ్‌మెంట్), BE/BTech/B.Arch, CA/CFA/CWA, LLB, LLM, MTech, M.Planing ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iifclprojects.in

News January 22, 2026

అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఇద్దరు హీరోలు?

image

వరుస హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి మూవీ రిలీజయ్యే అవకాశముందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ, రానా గతంలో ‘రానా నాయుడు’ సిరీస్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

News January 22, 2026

హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

image

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.