News December 3, 2024
నటి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్

హైదరాబాద్ గచ్చిబౌలిలో నటి శోభిత శివన్న ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె తల్లి, అక్కాచెల్లెళ్లు నిన్న పోలీసుల విచారణలో పలు విషయాలు వివరించారు. ఆమె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలు మానేసిందని, తెలుగులో అవకాశాల కోసం HYD వచ్చిందని చెప్పారు. ఒంటరిగా ఉండటం, అవకాశాలు రాక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
Similar News
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.
News March 13, 2026
CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్‌సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.


