News December 3, 2024

భారత్‌కు అధునాతన ఆయుధ వ్యవస్థలు.. విక్రయించేందుకు US ఆమోదం

image

భారత్‌కు $1.17 బిలియన్ల విలువైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను విక్రయించేందుకు US కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలం మరి కొన్ని వారాల్లో ముగుస్తుండగా వీటిని భారత్‌కు అందించేందుకు బైడెన్ ఒకే చెప్పారు. ఇందులో MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ భాగాలు, జాయింట్ టాక్టికల్ రేడియో సిస్టమ్స్, అడ్వాన్సుడ్ డేటా ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తదితర సామగ్రి ఉన్నాయి.

Similar News

News March 24, 2026

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ చేపట్టిన బోర్డు ఫలితాలను APR 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 8లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. సిలబస్ మారడం, సబ్జెక్టుల ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల 30రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటివారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది.

News March 24, 2026

రామ్ పోతినేని కొత్త సినిమా ఫిక్స్?

image

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు అసోసియేట్‌గా పనిచేసిన లోగి విఘ్నేశ్‌తో ఆయన సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాయి. కథా చర్చలు జరిగాయని, హీరో స్టోరీని ఓకే చేశారని తెలిపాయి. 2026లోనే రిలీజయ్యే ఛాన్సుందని చెప్పాయి. కాగా రామ్ చివరగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాని సంగతి తెలిసిందే.

News March 24, 2026

క్రూడాయిల్, ఎరువులపై ఫోకస్!

image

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోలియం, ఫర్టిలైజర్స్ శాఖలపై కేంద్రం నిర్వహిస్తున్న కీలక <<19465756>>భేటీ<<>> కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా మొరాకో నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హార్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ సరఫరాకు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధనం ఉందని, ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని కేంద్రం తెలిపింది.