News December 3, 2024
భారత్‌కు అధునాతన ఆయుధ వ్యవస్థలు.. విక్రయించేందుకు US ఆమోదం
భారత్‌కు $1.17 బిలియన్ల విలువైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను విక్రయించేందుకు US కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలం మరి కొన్ని వారాల్లో ముగుస్తుండగా వీటిని భారత్‌కు అందించేందుకు బైడెన్ ఒకే చెప్పారు. ఇందులో MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ భాగాలు, జాయింట్ టాక్టికల్ రేడియో సిస్టమ్స్, అడ్వాన్సుడ్ డేటా ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తదితర సామగ్రి ఉన్నాయి.
Similar News
News January 16, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.
News January 16, 2025
గిరిజన రైతులకు గుడ్ న్యూస్
TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.
News January 16, 2025
BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.