News December 3, 2024
Stock Market: వరుసగా మూడోరోజు లాభాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో పయనించాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, IT షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతు బెంచ్ మార్క్ సూచీల గెయిన్స్‌కు దన్నుగా నిలిచాయి. Sensex 597 పాయింట్ల లాభంతో 80,845 వద్ద, Nifty 181 పాయింట్ల లాభంతో 24,457 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు Sensexలో 80,900 వద్ద, నిఫ్టీలో 24,480 పరిధిలో ఉన్న కీలక Resistance సూచీలను తదుపరి ముందుకు కదలనివ్వలేదు.
Similar News
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.
News November 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


