News December 3, 2024
రామ్మోహన్ నాయుడు రికార్డు

అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆయన తండ్రి ఎర్రన్నాయుడు పేరుతో ఉండేది. కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా రామ్మోహన్ నాయుడు దీన్ని అభివర్ణించారు.
Similar News
News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5


