News December 3, 2024
రామ్మోహన్ నాయుడు రికార్డు
అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆయన తండ్రి ఎర్రన్నాయుడు పేరుతో ఉండేది. కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా రామ్మోహన్ నాయుడు దీన్ని అభివర్ణించారు.
Similar News
News January 16, 2025
మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?
జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.
News January 16, 2025
నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR
TG: ACB, ED ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని కేటీఆర్ చెప్పారు. ఈడీ విచారణ తర్వాత మాట్లాడుతూ ‘ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా. విచారణకు సహకరిస్తా. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించే వ్యక్తిగా నా నిజాయితీని నిరూపించుకుంటా అని వారితో చెప్పా. అయితే విచారణకు ₹5-10 కోట్లు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. ఈ మొత్తంతో 2,500 మందికి పెన్షన్లు, 500 మందికి రుణమాఫీ చేయొచ్చు’ అని చెప్పారు.
News January 16, 2025
సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసిన దుండగుడు!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్‌ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.