News December 4, 2024

నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్

image

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4.08 గంటలకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను నింగిలోకి చేర్చనున్నారు. ఇవే కాకుండా మరో నాలుగు ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. భూమి నుంచి దాదాపు 60 వేల కి.మీ ఎత్తున ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నారు.

Similar News

News January 9, 2026

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

గువాహటిలోని <>కాటన్ <<>>యూనివర్సిటీ 18 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు JAN 21వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc (ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, Environ. బయాలజీ, Biotech, మాలిక్యులార్ బయాలజీ, బయో కెమిస్ట్రీ), MCA/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://cottonuniversity.ac.in

News January 9, 2026

SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

image

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/

News January 9, 2026

జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.