News December 4, 2024
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4.08 గంటలకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను నింగిలోకి చేర్చనున్నారు. ఇవే కాకుండా మరో నాలుగు ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. భూమి నుంచి దాదాపు 60 వేల కి.మీ ఎత్తున ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నారు.
Similar News
News January 22, 2025
మీరే ప్రధాని అయితే..
USA అధ్యక్షుడైన తొలిరోజే ట్రంప్ సంతకాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. పుట్టుకతో పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ సహా అనేక ముఖ్య నిర్ణయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఈ సంతకాలపై USతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ‘ఒకే ఒక్కడు’లో ఒక్కరోజు CMలా, మీరు ఒక్కరోజు ప్రధానిగా ఒక్క నిర్ణయం అమలు చేసే అధికారం వస్తే ఏ ఫైలుపై సైన్ చేస్తారు? కామెంట్ చేయండి.
News January 22, 2025
తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
News January 22, 2025
జనవరి 22: చరిత్రలో ఈ రోజు
1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1972: సినీ నటి నమ్రత జననం
1989: సినీ నటుడు నాగశౌర్య జననం
2014: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) మరణం