News December 4, 2024
ప్రమాదం నుంచి కాపాడిన యాపిల్ వాచ్!

యాపిల్ వాచ్ సాయంతో అమెరికాలో కుల్‌దీప్ ధన్‌కర్ అనే భారత సంతతి వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. హైవేపై ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన ఆయన యాపిల్ వాచ్ 911కి హెల్ప్‌లైన్ కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చిన పోలీసులు వారికి సాయం చేసి మరో కారులో ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని కుల్‌దీప్ నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
Similar News
News March 13, 2026
శుక్రవారం రోజున జన్మిస్తే..

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.
News March 13, 2026
SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.
News March 13, 2026
ఉగాది ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?

ఈ ఏడాది మార్చి 19న ఉగాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఆ రోజున 3:45 AM – 5:30 AM మధ్య నిద్రలేవడం శ్రేయస్కరం. నువ్వుల నూనెతో స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటిని మామిడి తోరణాలు, ముగ్గులతోనే కాకుండా వేప కొమ్మలతోనూ అలంకరించడం మంచిది. షడ్రుచుల పచ్చడిని తప్పక తాగాలి. ఇది ప్రకృతి ఇచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఇస్తుంది. పంచాంగ శ్రవణంతో రాశిఫలాలు తెలుసుకోవాలి’ అంటున్నారు.


