News December 4, 2024

ప్రమాదం నుంచి కాపాడిన యాపిల్ వాచ్!

image

యాపిల్ వాచ్ సాయంతో అమెరికాలో కుల్‌దీప్ ధన్‌కర్ అనే భారత సంతతి వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. హైవేపై ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన ఆయన యాపిల్ వాచ్ 911కి హెల్ప్‌లైన్ కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చిన పోలీసులు వారికి సాయం చేసి మరో కారులో ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని కుల్‌దీప్ నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

Similar News

News January 23, 2025

రోహిత్ చివరి 17 ఇన్నింగ్సుల స్కోర్లు ఇవే

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిరోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ (3) దారుణంగా విఫలమయ్యారు. చివరి 17 ఇన్నింగ్సు(అన్ని ఫార్మాట్లు)ల్లో ఆయన ఒకే ఒక ఫిఫ్టీ సాధించారు. ఐదు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేశారు. 17 ఇన్నింగ్సుల్లో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 3, 6, 10, 3, 9, 3 పరుగులు చేశారు.

News January 23, 2025

రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు

image

TG: దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్‌తో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. HYDలో ఈ సంస్థ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

News January 23, 2025

IPL: KKRకు బిగ్ షాక్?

image

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఎంపీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతూ ఆ జట్టు ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు. కేరళతో జరిగిన మ్యాచులో ఆయన కాలిమడమకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టొచ్చు. కాగా IPL మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి వెంకటేశ్‌ను KKR కొనుగోలు చేసింది. ఈ సీజన్‌కు ఆయనను కెప్టెన్‌గా కూడా నియమిస్తారని వార్తలు వచ్చాయి.