News December 4, 2024
GOOD NEWS.. త్వరలోనే పెన్షన్ల పెంపు

TG: దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె పలువురికి కృత్రిమ యంత్రాలు, వినికిడి యంత్రాలు, ఇతర పరికరాలు అందించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్రం కూడా దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1000 పెంచేలా NDA ఎంపీలు డిమాండ్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 29, 2025
తుఫానుగా బలహీనపడ్డ మొంథా

AP: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘మొంథా’ తుఫానుగా బలహీనపడినట్లు IMD పేర్కొంది. ‘నర్సాపూర్‌కు పశ్చిమ-వాయవ్య దిశలో 20K.M, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50K.M, కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 90K.M, విశాఖకు నైరుతి దిశలో 230K.M, గోపాల్పూర్(ఒడిశా)కు నైరుతి దిశలో 470K.M. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 6 గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగించి, తదుపరి 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 29, 2025
కర్నూలు ప్రమాదం.. బస్సు డ్రైవర్ అరెస్ట్

AP: కర్నూలులో జరిగిన ఘోర <<18110276>>బస్సు ప్రమాదం<<>> కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. A2గా ఉన్న బస్సు యజమాని కోసం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి 10 ని. ముందు అటుగా వెళ్లిన 35మంది డ్రైవర్లను ప్రశ్నించి.. లక్ష్మయ్య నిర్లక్ష్యమూ ప్రమాదానికి కారణమని గుర్తించి అరెస్టు చేశారు.
News October 29, 2025
అంగన్వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.


