News December 4, 2024

GOOD NEWS.. త్వరలోనే పెన్షన్ల పెంపు

image

TG: దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె పలువురికి కృత్రిమ యంత్రాలు, వినికిడి యంత్రాలు, ఇతర పరికరాలు అందించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్రం కూడా దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1000 పెంచేలా NDA ఎంపీలు డిమాండ్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 15, 2025

బ్యాక్ టు హైదరాబాద్

image

సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

News January 15, 2025

గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?

image

AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.

News January 15, 2025

40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా

image

ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉప‌క‌రిస్తున్న‌ గ్యాస్, ఎనర్జీ స‌దుపాయాలే ల‌క్ష్యంగా ర‌ష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంప‌నుంది.